Home » Jammu and Kashmir
Operation Sindoor: పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ సహా పలు ప్రాంతాల ప్రజలు ఢిల్లీకి చేరుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన దాడులను పహల్గాం బాధితుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం ప్రశంసించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయని, న్యాయం జరిగిందని బాధిత కుటుంబం పేర్కొంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం.. గ్యాప్ లేకుండా కాల్పులకు తెగబడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత కర్నా సెక్టార్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులు జరిపిందని, షెల్లు, మోర్టార్లను ప్రయోగించిందని, విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని ఎన్ఐఏ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం ఉంటే వాటిని స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది.
ఆపరేషన్ సిందూర్ ఘటన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్ దాడుల్లో 15 మంది భారత పౌరులు మరణించగా, మరో 43 మంది గాయపడ్డారు.
పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.
UNSC Meeting On Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి మాకెలాంటి సంబంధం లేదు. మేమూ ఉగ్రవాద బాధితులమే.. దీని వెనక భారత్ హస్తమే ఉందేమో అని బొంకుతున్న దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పహల్గాం దాడిపై నిర్వహించిన రహస్య సమావేశంలో లష్కరే తోయిబాకు, మీ దేశానికి ఉన్న లింకేంటని సూటిగా ప్రశ్నించింది. దీంతో పాక్ ఏమన్నదంటే..
ఢిల్లీ ముంబై సహా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కు భారత్ సిద్ధమవుతుండగా, ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించే పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, పౌరుల భద్రతను మెరుగుపర్చేందుకు కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా, పాకిస్థాన్ నిరంకుశంగా ఉన్నట్లు చైనా మరోసారి ప్రకటించింది