Share News

JK LG Manoj Sinha: పాక్‌లో భారత ఆర్మీ చేరుకోలేని ప్రాంతం ఏదీ లేదు: ఎల్జీ మనోజ్ సిన్హా

ABN , Publish Date - May 17 , 2025 | 09:15 PM

భారతదేశం ఎన్నడూ యుద్ధం కోరుకోదని, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుందని ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి తంగ్‌ధర్ సెక్టార్‌లోని సాయుధ బలగాలను మనోజ్ సిన్హా శనివారంనాడు కలుసుకున్నారు.

JK LG Manoj Sinha: పాక్‌లో భారత ఆర్మీ చేరుకోలేని ప్రాంతం ఏదీ లేదు: ఎల్జీ మనోజ్ సిన్హా

శ్రీనగర్: పాక్‌లో భారత ఆర్మీ చేరుకోలేని ప్రదేశమంటూ ఏదీ లేదని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) అన్నారు. భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. భారత్‌తో సంధి కుదర్చమంటూ ప్రపంచ దేశాలకు పాక్ బతిమలాడుకుందని చెప్పారు. భారతదేశం ఎన్నడూ యుద్ధం కోరుకోదని, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుందని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి తంగ్‌ధర్ సెక్టార్‌లోని సాయుధ బలగాలను మనోజ్ సిన్హా శనివారంనాడు కలుసుకున్నారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో బెంబేలెత్తిన పాక్ : అమిత్‌షా


''భారత బలగాల ధైర్యసాహసాలు, భారత్‌తో సంధి కోసం పాక్ పాకులాడటం ఈరోజు యావత్ ప్రపంచం చూసింది. భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరి కొద్దిరోజుల్లోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలనుకుంటోంది. అభివృద్ధి భారతం కలను సాకారం చేసుకునే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం'' అని మనోజ్ సిన్హా చెప్పారు. అయితే పొరుగు దేశం మాత్రం అప్పులు తెచ్చుకున్న సొమ్ములతో మానవాళి వినాశనానికి పాటుపడుతోందని విమర్శించారు. భారత బలగాలు ఇచ్చిన సమాధానంతోనైనా పాక్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. భారత సైన్యం పాక్‌లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగలదని, మన బలగాల ధైర్యం, సామర్థ్యం, దేశం పట్ల ఉన్న అంకితభావానికి తాను శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఎలాంటి సంక్షోభం వచ్చినా మన దేశం సైన్యం చేతిలో సురక్షితంగా ఉందని ప్రజలు తెలుసుకోవాలన్నారు.


ఇవీ చదవండి:

Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 09:20 PM