Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో బెంబేలెత్తిన పాక్ : అమిత్‌షా
ABN , Publish Date - May 17 , 2025 | 08:26 PM
భారత ప్రజలపై ఎలాంటి టెర్రరిస్టు దాడులకు పాల్పడినా రెట్టింపు బలంతో విరుచుకుపడతామని ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు సష్టమైన సంకేతాలిచ్చాయని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్‌షా అన్నారు.
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రశంసలు కురిపించారు. ఉగ్రదాడులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తితే, పాక్ బెంబేలెత్తిందని అన్నారు. పాక్‌లో 100 కిలోమీటర్ల లోపలకు భారత సాయుధ బలగాలు చొచ్చుకెళ్లి మరీ భీకరదాడుల జరిపాయని చెప్పారు. అనేక అంతర్జాతీయ ఉగ్ర కార్యకలాపాలకు వ్యూహరచన చేసి, సియాల్‌కోట్, ఇతర ఉగ్రవాద శిబిరాలలో తలదాచుకున్న ముష్కరులకు భారత్ చాలా స్పష్టమైన సందేశమిచ్చిందన్నారు. భారత ప్రజలపై ఎలాంటి టెర్రరిస్టు దాడులకు పాల్పడినా రెట్టింపు బలంతో విరుచుకుపడతామనే సష్టమైన సంకేతాలిచ్చామని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్‌షా అన్నారు.
Pakistan: భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్‌బేస్‌ల మరమ్మతుకు పాక్ టెండర్లు..
''ఈసారి ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశాం. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూ శిక్షణ ఇస్తున్న 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాం'' అని అమిత్‌షా చెప్పారు.
అణుబాంబులున్నాయంటూ పాకిస్తాన్ చేసిన బెదిరింపులు భారత్ ఖాతర చేయలేదని హోం మంత్రి చెప్పారు. ''ఆటంబాంబులున్నాయని బెదిరిస్తే భయపడిపోతామని వారు అనుకున్నారు. కానీ మన ఆర్మీ, నేవీ, వాయిసేన ఏమాత్రం ఖాతరు చేయకుండా వారికి గట్టి గుణపాఠం చెప్పింది. మన బలగాల సహనం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ చూసి యావత్ ప్రపంచం ప్రశంసలు కురిపించింది. భారతదేశానికి స్వాతంత్య్యం వచ్చిన తర్వాత భారత బలగాలు పాక్‌లో 100 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకెళ్లి మరీ దాడులు జరపడం ఇదే మొదటిసారి'' అని అమిత్‌షా తెలిపారు.
ఇవీ చదవండి:
Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి