Home » Israel
హార్ముజ్ జలసంధిని మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ఆందోళన రేకెత్తించడంతో అమెరికా చైనా సాయాన్ని అభ్యర్థించింది. ఇరాన్ మనసు మార్చాలని కోరింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్వయంగా వెల్లడించారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం బీ2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై బీయూ-57 బంకర్-బస్టర్ బాంబులు, తొమహాక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, అమెరికా కూడా రంగంలోకి దిగి దాడులు చేయడంతో పర్షియన్ గల్ఫ్‌లో గగనతలం ప్రమాదకరంగా మారింది.
ఇరాన్ అణు స్థావరాలపై మెరుపు వేగంతో దాడి చేసిన అమెరికా.. అసలు దాడి ఎలా చేశామన్నది చెప్పింది. ఇరాన్‌ను ఏమార్చి దెబ్బకొట్టామన్న అగ్రరాజ్యం.. ఈ దాడులు ఒక అద్భుతమని పేర్కొంది. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరిట ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామన్న అమెరికా..
Iran And Israel War: ది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మార్గం ద్వారా ప్రతీ రోజు 2 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఇండియాకు దిగుమతి అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది.
మిసైళ్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఊహించని విధంగా గట్టి షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
ఇజ్రాయెల్‌లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది.
ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో తొలిసారిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఇది చారిత్రాత్మక క్షణమని అన్నారు. సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.
Masoud Pezeshkian About Nuclear Activities: ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకెళ్తోంది. అలాగే అమెరికా కూడా టెహ్రాన్ అణు చర్చలకు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయినా, ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణుకార్యకలాపాలు ఆపబోమని తేల్చి చెప్పింది.