Share News

Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు.. రోడ్డుపై క్షిపణి విధ్వంసం చూడండి.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 23 , 2025 | 05:31 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దాదాపు పదకొండు రోజులుగా రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగింది.

Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు.. రోడ్డుపై క్షిపణి విధ్వంసం చూడండి.. వీడియో వైరల్
ranian Missile Hit Israeli City Ashdod

ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran War) మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దాదాపు పదకొండు రోజులుగా రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగింది (Iranian Missile). 15 బాలిస్టిక్ క్షిపణులతో ఉత్తర ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ దాడులకు దిగినట్టు ఐడీఎఫ్ (IDF) ప్రకటించింది. ఇరాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్ నగరాల్లో సైరెన్లు మోగుతూనే ఉన్నాయి.


ఇజ్రాయెల్ నగరమైన అష్దోద్ (Ashdod) నగరంపై ఇరాన్ క్షిపణులతో విరచుకుపడింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కారు రోడ్డు మీద వేగంగా వెళుతోంది. ఆ సమయంలో అదే రోడ్డు మీద భారీ క్షిపణి పడింది. దీంతో దట్టమైన పొగ, మంటలతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారింది. రోడ్డు అంతా రాళ్లు, దుమ్ము, ధూళితో నిండిపోయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఇజ్రాయెల్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఈ కారణంగా పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరా లేక అంధకారంలోకి వెళ్లిపోయాయి. వీలైనంత త్వరగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, బాంబ్ షెల్టర్ కేంద్రాల్లోనే ఉండాలని ఉండాలని ప్రజలకు ఇజ్రాయెల్ అధికారులు సూచించారు.


ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

ఇరాన్ వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు

మరిన్ని అంతర్జాతీయ, బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 05:50 PM