Share News

Israel Air Strikes: ఇరాన్ వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:50 PM

ఇరాన్‌లోని పలు వైమానిక స్థావరాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ దాడుల్లో మిసైళ్లు నిల్వ చేసిన స్థావరాలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్‌లు నాశనమయ్యాయని వెల్లడించింది.

Israel Air Strikes: ఇరాన్ వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
Israel Iran Airstrikes 2025

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దేశంలో పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాల్లో గల ఆరు వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా వెల్లడించింది. దాడుల తాలూకు వీడియోలు కూడా షేర్ చేసింది. 15 యుద్ధ విమానాలతో ఈ దాడులు చేశామని తెలిపింది. రన్‌వేలు, భూగర్భంలోని బంకర్‌లు, ఓ రీఫ్యుయెలింగ్ ప్లేన్, ఎఫ్-14, ఎఫ్-5, ఏహెచ్-1 విహంగాలు, హెలికాఫ్టర్‌లు ధ్వంసమయ్యాయని పేర్కొంది.


ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించాలనుకున్న యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. మిసైళ్లను నిల్వ చేసిన స్థావరాలను కూడా నాశనం చేసినట్టు పేర్కొంది. కచ్చితమైన నిఘా సమాచారంతో ఈ దాడులు చేసినట్టు వెల్లడించింది. ఇరాన్ మిలటరీ సామర్థ్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటామని, గగనతల యుద్ధంలో సంపూర్ణ ఆధిపత్యమే తమ లక్ష్యమని వెల్లడించింది. ఇరాన్‌ అణుస్థావరాలను అమెరికా ధ్వంసం చేశాక ఇజ్రాయెల్ మళ్లీ తన దాడులను కొనసాగిస్తోంది.


ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 01:32 PM