Share News

Operation Midnight Hammer: ఇరాన్‌ను ఏమార్చి కొట్టాం.. ఇది ఒక అద్భుతమన్న అమెరికా!

ABN , Publish Date - Jun 22 , 2025 | 10:25 PM

ఇరాన్ అణు స్థావరాలపై మెరుపు వేగంతో దాడి చేసిన అమెరికా.. అసలు దాడి ఎలా చేశామన్నది చెప్పింది. ఇరాన్‌ను ఏమార్చి దెబ్బకొట్టామన్న అగ్రరాజ్యం.. ఈ దాడులు ఒక అద్భుతమని పేర్కొంది. ఆపరేషన్​ మిడ్​నైట్​ హామర్​ పేరిట ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామన్న అమెరికా..

Operation Midnight Hammer: ఇరాన్‌ను ఏమార్చి కొట్టాం.. ఇది ఒక అద్భుతమన్న అమెరికా!
Operation Midnight Hammer

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ అణు స్థావరాలపై కాంతి కంటే వేగంతో దాడి చేసిన అమెరికా.. అసలు దాడి ఎలా చేశామన్నది చెప్పింది. ఇరాన్‌ను ఏమార్చి దెబ్బకొట్టామన్న అగ్రరాజ్యం.. ఈ దాడులు ఒక అద్భుతమని పేర్కొంది. ఆపరేషన్​ మిడ్​నైట్​ హామర్​ పేరిట ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేశామన్న అమెరికా.. ఫార్దో, నతాంజ్‌, ఇస్పహాన్‌ అణు స్థావరాలను ఎలా కొట్టామో వివరించింది.

war-heads-4.jpg

B-2 స్టెల్త్ విమానాలతో బలవర్థకమైన ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్-బస్టర్ బాంబులను జారవిడిచినట్టు అమెరికా ప్రకటించింది. జలాంతర్గామి నుండి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు మరో రెండు అణుకేంద్రాలను కొట్టాయని వెల్లడించింది. ఇరాన్‌ను ఏమార్చి దెబ్బ కొట్టామని ప్రకటించిన అమెరికా, పక్కా ప్రణాళికతో దాడులు చేశామంది. అదే సమయంలో తమ యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగొచ్చాయని పేర్కొంది.

war-heads.jpgఆపరేషన్ మిడ్ నైట్ హేమర్ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ఈరోజు విలేకరులతో పంచుకున్నారు. ఇది అమెరికా ఉమ్మడి దళాల అసాధారణమైన నైపుణ్యం, క్రమశిక్షణతో నిర్వహించిన సంక్లిష్టమైన, అధిక-రిస్క్ అండ్ సీక్రెట్ మిషన్ అని చెప్పారు. ఈ దాడులతో ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బ కొట్టామని.. మొత్తంగా 14 బంకర్‌-బస్టర్‌ బాంబులను జారవిడిచినట్లు ఆయన తెలిపారు. పలు యుద్ధవిమానాల సహాయంతో ఈ పని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.


శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు B-2 బాంబర్ల దాడి జరిగిందన్న కెయిన్.. ఈ బాంబర్లను అమెరికా నుండే పంపించామని, తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడమే దీని ఉద్దేశ్యమన్నారు. ఈ బాంబర్లలో కొన్నింటిని పసిఫిక్ మహాసముద్రం వైపు పంపించి శత్రువులను తప్పుదోవ పట్టించామని, ఈ విషయం కొద్దిమంది ప్లానర్లకు, వాషింగ్టన్‌లోని ముఖ్య నాయకులకు మాత్రమే తెలుసని తెలిపారు.

war-heads-2.jpgప్రధాన దాడిలో ఏడు B-2 బాంబర్లను ఉపయోగించామని, ఒక్కో బాంబర్‌లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఈ బాంబర్లు తక్కువ తూర్పు వైపు నిశ్శబ్దంగా వెళ్లి.. 18 గంటల పాటు ప్రయాణించి, గాల్లోనే ఇంధనం నింపుకుని లక్ష్యాన్ని చేరుకున్నాయని చెప్పారు. అంతేకాదు, మరో గొప్ప విషయమేమంటే, ఆకాశంలో ఉండగానే B-2 బాంబర్లు ఇతర విమానాలతో కలిసిపోయాయని.. ఇది చాలా జఠిలమని.. కచ్చితమైన సమయం పాటిస్తూ.. తక్కువ ఎయిర్ స్పేస్‌లోనే అన్ని విమానాలు లింక్ కావాలన్న పెంటగాన్ సూచనల్ని కచ్చితంగా అమలు చేశాయని చెప్పారు. ఇలాంటి సమన్వయానికి అమెరికా దళాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి అని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 311 మంది భారతీయులు

ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు

For National News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 10:25 PM