Home » Insurance
పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు.
తాడేపల్లిగూడెంకి చెందిన ఒక వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన పెనుగొండ మండలం సిద్దాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు చంద్రన్న బీమా ఉంది. కుటుంబ సభ్యులు సచివాలయంలో ఆన్లైన్ చేయించారు.
దేశంలో బీమా వ్యవస్థను మరింత పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో IRDAI కొత్తగా బీమా సుగమ్ (Bima Sugam) పోర్టల్‌ను ప్రకటించింది. దీనిని ఎందుకు ప్రకటించారు, ఇది ఎలా పనిచేస్తుందనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.
మనం ఏళ్ల తరబడి బీమా ప్రీమియంలు కడతాం. కష్ట కాలంలో ఆసరాగా ఉంటుందని భారీ బీమా కవర్ తీసుకుంటాం. కానీ, నిజంగా అవసరం వచ్చినప్పుడు బీమా కంపెనీ మనల్ని మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అర్చకులకు ఇన్సూరెన్స్ పథకం తీసుకురావాలని, ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ అర్చక సమాఖ్య జేఏసీ చైర్మన్ గంగ ఉపేంద్ర శర్మ చెప్పారు.
మీరు ఎప్పుడైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు మొదట్లో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఏడాది, రెండేళ్లు గడిచాక ఆ ప్రీమియం ఒక్కసారిగా పైపైకి చేరుతుంది. దీనిపై IRDAI కొత్త రూల్ తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతోంది. అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతోంది.
ప్రమాద బీమా పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమే. ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో ఆసరానిస్తుంది. ఇందుకోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. రోజుకు రెండు రూపాయలు కడతే, పదిహేను లక్షలకు..
మనలో చాలామందికి పెట్టుబడి, బీమా వంటి విషయం అంతగా అర్థం కావు. అయితే, ఈ రెండు ప్రయోజనాలను ఒకే పథకం ద్వారా పొందేందుకు ఒక మంచి పాలసీ ఉంది. అదే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP). మరి, ఈ స్కీం ద్వారా ఏఏ ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.
మీరు పిఎఫ్ ఖాతాదారులా.. అయితే, మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉందని తెలుసా? EDLI పథకం ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) సభ్యులకు జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. ఈ పథకం ద్వారా మరణించిన EPF సభ్యుని నామినీ లేదా చట్టపరమైన వారసులకు పెద్ద మొత్తంలో..