Share News

Man Allegedly Assasinates Family: ఇన్సురెన్స్ డబ్బుల కోసం దారుణం.. కుటుంబాన్ని చంపేసి..

ABN , Publish Date - Sep 29 , 2025 | 09:51 PM

పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు.

Man Allegedly Assasinates Family: ఇన్సురెన్స్ డబ్బుల కోసం దారుణం.. కుటుంబాన్ని చంపేసి..
Man Allegedly Assasinates Family

ఉత్తర ప్రదేశ్‌లో మనసు కలిచి వేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇన్సురెన్స్ డబ్బుల కోసం మొత్తం కుటుంబాన్నే చంపేశాడు. కోట్ల కోసం తల్లీదండ్రీ, భార్యను కడతేడ్చాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. హపుర్‌కు చెందిన ముకేష్ సింఘాల్ తన పేరు మీద చాలా కంపెనీల ఇన్సురెన్స్‌‌లు చేయించుకున్నాడు. నివా బూపా, టాటా ఏఐజీ, మ్యాక్స్ లైఫ్, ఆధిత్య బిర్లా, హెడ్‌డీఎఫ్‌సీ ఎర్గో కంపెనీల నుంచి కోట్ల రూపాయలకు ఇన్సురెన్స్ చేయించుకున్నాడు. ఆ మొత్తం ఇన్సురెన్స్‌ల విలువ 39 కోట్ల రూపాయలు ఉంటుంది.


ఈ మొత్తం ఇన్సురెన్స్‌లకు ముకేష్ కొడుకు విశాల్ కుమార్ నామినీగా ఉన్నాడు. 2024, మార్చి 27వ తేదీన ముకేష్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. కొన్ని రోజులకే విశాల్ తండ్రి పేరు మీద ఉన్న ఇన్సురెన్స్ డబ్బుల్ని క్లైమ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే, నివా బుపా కంపెనీకి అతడిపై అనుమానం వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. అతడు సమర్పించిన రెండు హాస్పిటల్ మెడికల్ రిపోర్టుల్లో ముకేష్ చనిపోయిన సమయం వేరు వేరుగా ఉంది. దీంతో అనుమానం వచ్చిన కంపెనీ పోలీసులను ఆశ్రయించింది. విశాల్‌పై కేసు పెట్టింది.


పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు. ఆ తర్వాత అతడి భార్య కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ సమయంలో ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 30 లక్షల రూపాయలు పొందాడు. ఇప్పుడు అతడి తండ్రి ముకేష్ రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇప్పటికే విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి కోటి రూపాయలు పొందాడు.


ఇలా కుటుంబం మొత్తం రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోవటం వెనుక విశాల్ కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేక్ ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్స్ సృష్టించి తండ్రి ఇన్సురెన్స్ డబ్బులు దోచేయాలని విశాల్ ప్లాన్ చేశాడు. ఇంతలోనే అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. విశాల్ పోలీసుల దర్యాప్తుకు సహకరించటం లేదని తెలుస్తోంది. అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడని సమాచారం.


ఇవి కూడా చదవండి

బైకుపై షికారుకు వెళ్లిన లవర్స్.. అది చూసిన కుటుంబసభ్యులు..

బైకుపై షికారుకు వెళ్లిన లవర్స్.. అది చూసిన కుటుంబసభ్యులు..

Updated Date - Sep 29 , 2025 | 09:56 PM