Lovers Married During Ride: బైకుపై షికారుకు వెళ్లిన లవర్స్.. అది చూసిన కుటుంబసభ్యులు..
ABN , Publish Date - Sep 29 , 2025 | 08:28 PM
శనివారం ఇద్దరూ కలిసి బైకుపై షికారుకు వెళ్లారు. షికారు అయిపోయిన తర్వాత నిశాను నది దగ్గర వదిలిపెట్టాడు సోను. ఇది కొంతమంది గ్రామస్తులు చూశారు. వెంటనే ఇరు కుటుంబాల పెద్దలకు సమాచారం ఇచ్చారు.
లవర్స్ అన్న తర్వాత సినిమాలు, షికార్లు కామన్. అమ్మాయిలు ఇంట్లో వాళ్లకు తెలియకుండా నచ్చిన వ్యక్తితో సరదాగా గడపడానికి నానా తంటాలుపడుతుంటారు. ప్రియుడితో బయటకు వెళ్లినపుడు కుటుంబసభ్యులు, తెలిసిన వాళ్లకు కనపడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా కొంతమంది దొరికిపోతూ ఉంటారు. సాధారణంగా ఇలా ప్రియుడితో దొరికిపోయిన ప్రియురాలిని కుటుంబసభ్యులు తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం ప్రేమ జంటకు కుటుంబసభ్యులు పెళ్లి చేసేశారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, గోండా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సోను మౌర్య, నిశా మౌర్య గత కొంత కాలంనుంచి ప్రేమించుకుంటున్నారు. శనివారం ఇద్దరూ కలిసి బైకుపై షికారుకు వెళ్లారు. షికారు అయిపోయిన తర్వాత నిశాను నది దగ్గర వదిలిపెట్టాడు సోను. ఇది కొంతమంది గ్రామస్తులు చూశారు. వెంటనే ఇరు కుటుంబాల పెద్దలకు సమాచారం ఇచ్చారు. తర్వాత పంచాయతీ మొదలైంది. రెండు కుటుంబాల పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.
రామ్ జానకీ గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరికీ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘దొరికిన వాళ్లందరికీ పెళ్లి చేస్తారని తెలిస్తే సగం మంది లవర్స్ కలిసి బయట తిరగటమే మానేస్తారు. నూటికి 70 శాతం మంది టైమ్ పాస్ కోసం ప్రేమిస్తున్నారు’..‘నాకు, నా లవర్‌కు ఇలా పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో’అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్‌కు ఏమైంది?.. మరీ ఇంత దారుణమా.. ఈ సారి సినిమాలు..
ఐఫోన్ కొనడానికి డబ్బులివ్వండి ప్లీజ్.. ఫాలోవర్స్‌కు లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్ రిక్వెస్ట్..