Insurance Scheme: అర్చకులకు ఇన్సూరెన్స్ పథకం!
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:22 AM
అర్చకులకు ఇన్సూరెన్స్ పథకం తీసుకురావాలని, ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ అర్చక సమాఖ్య జేఏసీ చైర్మన్ గంగ ఉపేంద్ర శర్మ చెప్పారు.
ప్రభుత్వంతో కొనసాగుతున్న సంప్రదింపులు: అర్చక జేఏసీ
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అర్చకులకు ఇన్సూరెన్స్ పథకం తీసుకురావాలని, ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ అర్చక సమాఖ్య జేఏసీ చైర్మన్ గంగ ఉపేంద్ర శర్మ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అర్చక సమస్యలపై జరిగిన పోరాటాల ఫలితంగానే ధూప, దీప, నైవేద్యం పథకం అమలులోకి వచ్చిందన్నారు. 65-ఎ ద్వారా వేతనాలు సాధించామని, అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా చిన్న అర్చకులకు ప్రయోజనం చేకూర్చామని తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అర్చకుల హక్కులు, సంక్షేమం, ఆలయాల అభివృద్ధిపై పలు తీర్మానాలు ఆమోదం పొందాయి.