Home » HYDRA
జూబ్లీ ఎన్క్లేవ్ కూల్చివేతలపై హైడ్రాకు షాక్ తగిలింది. అక్కడ హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైడ్రా ఏం చేస్తుందన్నది ఏడాదిలో అందరికీ అర్థమవుతుంది. కాలగమనంలో హైడ్రా విశిష్టత తెలుస్తుంది. వంద, రెండు వందల ఏళ్ల హైదరాబాద్ భవిష్యత్తు కోసం.. భవిష్యత్ తరాల ఆరోగ్య జీవనం కోసం సంస్థ పని చేస్తోంది’’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు..
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా మరోసారి కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఆక్రమణలను తొలగించింది. మెటల్ చార్మినార్ నమూనాకు ఎదురుగా హైటెక్‌సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని ఉన్న 3వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలం సహా మొత్తంగా 16వేల చదరపు గజాల విస్తీర్ణంలోని పార్కులు, భారీ హోటల్ షెడ్డు, రహదారులపై ఉన్న ఇతర ఆక్రమణలను గురువారం హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేశాయి.
బతుకమ్మ కుంట అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. చెరువును కాపాడేందుకు శాశ్వత సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతుంది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి
హిమాయత్ సాగర్ 10 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో కుల్సుంపురా ప్రాంతంలోని మూసీ నది రోడ్డు వరదలకు గురైంది. వెంటనే అధికారులు రోడ్డును మూసివేసి వాహనాలను దారి మళ్లించారు.
హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్‌పేటలో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది.
హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని తెలిపారు. హైడ్రాలో పని చేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో హైడ్రా మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేతనాల్లో ఊహించని తగ్గింపుతో అసంతృప్తికి లోనైన మార్షల్స్ (మాజీ సైనికులు) విధులను బహిష్కరించారు. వీరి గైర్హాజరీతో మాన్సూన్ చర్యలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.