Home » Hyderabad
హైదరాబాద్ మాదాపూర్‌లో గల ఓయో హోటల్‌లో హత్యకు గురైన యువతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధి రహింపురాలో సాయినాథ్ సింగ్ అనే యువకుడిని ఓ మహిళ హత్య చేసింది. వివాహిత అనిషా సింగ్‌ను గతకొంతకాలంగా అతడు వేధిస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడిని తన పుట్టింటికి పిలిపించి చున్నీని మెడకు బిగించి చంపేసింది.
షేర్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయంటూ నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సైబర్ నేరగాళ్లు ఇద్దరిని బురిడీ కొట్టించారు.
హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె శంషాబాద్‌కు క్యాబ్‌లో బయలుదేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ ఇలా.. ఏదేని సోషల్ మీడియా ద్వారా సైబర్ కేటుగాళ్లు తీయని మాటలతో అమాయకులను వలలో వేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 27, వంకాయ 35, బెండకాయ 45, పచ్చిమిర్చి 45, బజ్జిమిర్చి 35, కాకరకాయ 35, బీరకాయ రూ.40లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
జపాన్‌లో జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.