Home » Hyderabad News
జీవన భాగస్వామిని కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటున్న ఆ తండ్రిని.. భారంగా భావించి బయటకు తరిమేశారు కుమారులు. తనకోసం ఉంచుకున్న కొద్దిభూమిలో సాగుచేసుకుని జీవనం సాగిద్దామన్నా అడ్డుపడి కర్కశత్వాన్ని చూపుతున్నారు.
దేశంలో ఎక్కడైనా ప్రభుత్వం వైఫల్యం చూస్తాం కానీ తెలంగాణలో ప్రతిపక్షం తన పాత్ర పోషించడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తన బాధ్యతల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు.
వందల కోట్ల రూపాయల ఆస్తులను వెనకేసిన మహిళా తహసీల్దార్ ఏసీబీ ఉన్నతాధికారుల ప్రసన్నం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనను సక్రమంగా చూపించుకోవడానికి మరోవైపు చార్టెర్డ్ అకౌంటెంట్ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి.
ప్రభుత్వంలోని ఓ శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ అధికారిణి రూ.2.5 కోట్లు ‘నజరానా’గా పుచ్చుకొని ఓ సంస్థకు ఏకపక్షంగా కాంట్రాక్టు కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని చెరువులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని, చాలా చెరువులు ఆక్రమణల పాలయ్యాయని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆక్షేపించింది. చెరువుల శిఖం భూముల్లోనే లే-అవుట్లు వేసిన దౌర్భాగ్యకర పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది
శాసనమండలి సభ్యుడు మీర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటించింది. తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆయన్ను ఆదేశించింది.
పార్కులు, చెరువులు, ట్యాంక్‌బండ్ వంటి ఆహ్లాదభరిత పర్యావరణంతో చల్లగా ఉండే హైదరాబాద్.. కాంక్రీట్ నిర్మాణాలతో క్రమేణా నిప్పుల కుంపటిగా మారుతోంది. గత 13 ఏళ్లలో నగరం ఉపరితల ఉష్ణోగ్రతలు ఏకంగా 4.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
తెలంగాణలో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)-2026’ ప్రక్రియలో పలు లోపాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ఓటరు జాబితాలో చేరకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనలు జారీ చేశారు. ఆ జిల్లాలు వివరాలిలా..