Home » Hyderabad City Police
ఎస్సార్ నగర్‌లో ఓ కూతురు తన తల్లి టాబ్లెట్‌లు వేసుకోలేదని రాడ్డుతో కొట్టి చంపింది. మృతి చెందిన తల్లి వయసు 90 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్‌లో భారీగా గంజాయిను పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్టు, కొత్తగూడ వద్ద తనిఖీ చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి.. చరిత్ర సృష్టించాయి.
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 2 సెంటిమీటర్ల వర్షాన్ని తట్టుకునే విధంగా గత పాలకులు హైదరాబాద్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారని తెలిపారు.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.
మూసి నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు.
రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతుకోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించామని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం.
స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వెళ్లాడు.