Home » Hindupur
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200యూనిట్ల ఉచిత విద్యుత అమలు చేయాలని చేనేతలు కోరారు. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చిన ఉచిత విద్యుత పథకం అధికారికంగా అమలు కాలేదన్నారు.
కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు.
సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.
అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
భగవంతుని సేవకు మించిందేది లేదని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పేట వెంకటరమణస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మనగా భగీరథ నవీనచంద్ర, తొమ్మిది మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహనరెడ్డి మేం అధికారంలోకి వచ్చాక సప్తసముద్రాల అవతలున్నా టీడీపీ నాయకులను, అధికారులను లాక్కొస్తానని పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు.
వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేష్ విగ్రహాలు గురువారం మధ్యాహ్నం నుంచి గుడ్డం కోనేరు వద్ద నిమజ్జనానికి క్యూకట్టాయి. భక్తులు రంగులు చల్లుకుంటూ కులమతాలకు అతీతంగా నృత్యాలు చేస్తూ లంబోధరుడి ఊరేగింపులో ముందుకు సాగారు.
మూడేళ్ల క్రితం హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్ వచ్చే డీజే శబ్దానికి ఓ యువకుడి గుండె ఆగింది. ఏడాది క్రితం హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్ ఉన్న డీజేలు వినియోగించారు.
పదవులు ముఖ్యం కాదని... వాటికే తాను అలంకారమన్నది తన భావనని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. మంచి ఉద్దేశంతో అఖండ- 2 మూవీ తీశామని చెప్పుకొచ్చారు. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని బాలకృష్ణ పేర్కొన్నారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.