Share News

GRIEVENCE: సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:14 AM

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

GRIEVENCE: సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌
Officials and leaders who participated in the public meeting

హిందూపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. హిందూపురం మండలంలోని 14 పంచాయతీలకు చెందిన ప్రజలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చేనెల ఇదే తేదీన హిందూపురం మండలానికి సంబంధించి ప్రజాదర్బార్‌ ఉంటుందని అప్పటికి ఈరోజు ఇచ్చిన ఫిర్యాదులు అన్నీ పరిష్కరించాలన్నారు. మొత్తంగా 72ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించి 34 ఫిర్యాదులు అందాయి. ప్రతివారం ఒక్కో మండలంలో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామన్నారు. అధికారులు కూడా వచ్చిన ఫిర్యాదులను సమయం తీసుకుని పరిష్కరించాలన్నారు. మార్కెట్‌యార్డ్‌ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి, కన్వీనర్‌ రాము, తహసీల్దార్‌ వెంకటేశులు, సీఐ ఆంజనేయులు, ఇరిగేషన డీఈ శైలేశ్వర్‌రెడ్డి, ట్రాన్సకో, మెప్మాతోపాటు పలుశాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:14 AM