Home » Heavy Rains
తొలుత తీవ్రమైన వర్షపాతం కారణంగా హిమకోటి మార్గాన్ని మూసి వేశారని, వాతావరణ పరిస్థితిలో మార్పులేకపోవడంతో కొద్ది గంటల సేపు యాత్రను సస్పెండ్ చేయాలని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు నిర్ణయించిందని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం నాడు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.
నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది.గత మూడు రోజులుగా పగటిపూట ఎండవేడి, రాత్రిపూట చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి కుండపోతగా మారింది.
కల్లోల వాతావరణం శాంతించింది. రైతుల గుండెల్లో మాత్రం అశాంతే మిగిలింది. విరామం లేకుండా కొన్నిరోజుల పాటు ఉధృతంగా కురిసిన వర్షం ఇప్పుడు లేదు. కానీ ఆ వాన మిగిల్చిన విపత్తు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం..
ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, భారీ వర్షాలకు, రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉంటే అవకాశం ఉన్నందున ప్రజలు లోతత్తు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు.
రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తుండంతో సామాన్య ప్రజాజీవనానికి అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్‌లలో వరదల తరహా పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ దెబ్బతింది.
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.