Home » Guntur
Tiranga Rallies: ఏపీ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ చేపట్టారు.
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌కు భూకబ్జా, హత్యాయత్నం కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
Chinta Mohan: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ప్రధాని మోదీ అఖిల పక్షంతో చర్చించి యుద్దం ఆపితే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని, 20 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వటం లేదని ఆరోపించారు.
Kotappakonda Giri Pradakshina: కోటప్పకొండలో గిరిప్రదక్షిణకు సోమవారం నాడు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సమయంలో అనుకోని ఘటన జరిగింది. ఓ భక్తుడు గిరిప్రదక్షిణ చేస్తుండగా కళ్లు తిరిగి పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో ఆ భక్తుడు మృతిచెందాడు.
Sajjala CID Inquiry: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
మంగళగిరి ఎయిమ్స్‌లో తలసీమియా బాధితుల కోసం బోన్‌మారో మార్పిడి చికిత్సలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో జెనెటిక్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకానుంది
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రికను గుంటూరులో ఆవిష్కరించారు. తెలుగు ప్రజలు పెద్దఎత్తున సభలకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
టీడీపీ విశాఖ మరియు గుంటూరు నగరాల్లో మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కుప్పం, తుని, మరియు పాలకొండ మున్సిపాలిటీలలో కూడా టీడీపీ నాయకులు కీలక పదవులను గెలిచారు. టీడీపీ మరియు కూటమి అభ్యర్థులు మేయర్, చైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికయ్యారు.