Share News

Guntur: డీసీఎంఎస్‌ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వడ్రాణం హరిబాబు నాయుడు

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:55 AM

జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ వడ్రాణం హరిబాబు నాయుడు ఎన్నికయ్యారు.

Guntur: డీసీఎంఎస్‌ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వడ్రాణం హరిబాబు నాయుడు

గుంటూరు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ వడ్రాణం హరిబాబు నాయుడు ఎన్నికయ్యారు. గుంటూరులో హరిబాబు అధ్యక్షతన రాష్ట్రంలోని 13 జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మన్లతో మంగళవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా వడ్రాణం హరిబాబు, ప్రధాన కార్యదర్శిగా గొంప కృష్ణ (విజయనగరం), ఉపాధ్యక్షునిగా చాగంటి మురళీకృష్ణ (పశ్చిమ గోదావరి), సెక్రటరీగా నెట్టెం వెంకటేశ్వర్లు (అనంతపురం)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. హరిబాబు నాయుడు మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని సీఎం చంద్రబాబు డీసీఎంఎస్‌ చైర్మన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

Updated Date - Jun 25 , 2025 | 02:55 AM