Share News

AP tobacco news: పొగాకు ఉత్పత్తి లక్ష్యం కుదింపు

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:41 AM

రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని టొబాకో బోర్డు కుదించింది. 2025-26 పంటకాలానికి 142 మిలియన్‌ కేజీల ఉత్పత్తిని నిర్ధారించింది.

AP tobacco news: పొగాకు ఉత్పత్తి లక్ష్యం కుదింపు

  • 2025-26 పంటకాలానికి 142 మిలియన్‌ కేజీలు నిర్ధారణ

గుంటూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని టొబాకో బోర్డు కుదించింది. 2025-26 పంటకాలానికి 142 మిలియన్‌ కేజీల ఉత్పత్తిని నిర్ధారించింది. గురువారం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో జరిగిన 165వ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. టొబాకో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈడీ బీ విశ్వశ్రీ, బెంగళూరు ఆక్షన్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, వైస్‌చైౖర్మన్‌ బొడ్డపాటి బ్రహ్మయ్య, బోర్డు సభ్యులు జీసీ విక్రమ్‌రాజ్‌, గుత్తా వాసుబాబు హాజరయ్యారు. ప్రధానంగా ప్రస్తుత సంవత్సరంలో పొగాకు రైతుకు తలెత్తిన నష్టాలు, విదేశాల నుంచి వస్తున్న ఎగుమతి ఆర్డర్లు గురించి చర్చించామని చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 27 , 2025 | 05:42 AM