Home » Guntur
పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళిపై చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అమరావతి వల్లే పొన్నూరు పొలాలు మునిగాయని అంబటి మురళి అసత్య ప్రచారం చేశారని అప్పాపురం కాలువ ఏఈఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చేబ్రోలు పీఎస్‌లో కేసు నమోదైంది.
ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో అనుమతించని ఆర్టీసీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘాట్ రూట్‌లలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
అర్హులకు మాత్రమే రేషన్ ఫలాలు అందడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడానికి వీలులేదన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగు తుండటంతో అర్హత లేకపోయినా పలువురు లబ్ధి పొందుతున్నారని సమాచారం. ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడాలంటే ఈ-కేవైసీతో పాటు క్షేత్రస్థాయి సర్వేతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా..
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.
రెంటచింతల మండల కేంద్రమైన రెంటచింతలలోని రేంజర్ వీదిలో(రైస్ మిల్ వద్ద) ఆదివారం రాత్రి టీచర్ల గృ హంలో భారీ దొంగతనం జరిగింది. దంపతులిద్దరూ ఊరెళ్లడంతో.. దొంగలు ఇనుప రాడ్‌తో తాళాలు, బీరువాను పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు.
భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం.., సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని నిర్ధారించడం వంటి
ఒకప్పుడు బిర్యానీ అంటే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం. ప్రస్తుతం బిర్యానీ సెంటర్లు మండల కేంద్రాల నుంచి ఓ మోస్తరు పెద్ద గ్రామాలకూ విస్తరించాయి. బిర్యానీ అంటే చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా భుజించడానికి ఇష్టపడతారు. ఇదే అవకాశంగా తక్కువ ధర అంటూ కూల్‌డ్రింక్స్ ఉచితం అంటూ రకరకాల ఆఫర్లతో..
గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాఘవేంద్రప్రసాద్, కల్యాణి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.4 కోట్లు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. దాతల విరాళంలోని రూ.40 లక్షలతో బీసీల కమ్యూనిటీ భవన నిర్మానానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.