Home » Ganesh Nimajjanam
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు గురువారంతో ముగిశాయని, శుక్రవారం ఎవరూ రావొద్దని సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్ కుమార్ సూచించారు. గురువారం ఉదయం నుంచే నిమజ్జన పనులు ప్రారంభించారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు.. నిర్వాహకులు స్థానిక పోలీసులకు సహకరించాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించొద్దని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం వెస్టుజోన్ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్, బంజారాహిల్స్, మధురానగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని గణేశ్ మండపాలను సీపీ సీవీ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సర్వవిఘ్నాలను హరించి విజయాలను చేకూర్చే విఘ్నవినాయకుడి అనుగ్రహం పొందాలంటే ఈ వినాయక చవితి రోజున ఈ సమయంలో పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గుడకు చెందిన మండప నిర్వాహకులు వినాయ కుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్ నగర్‌లో కేబుల్ వైరుకు తగిలి కింద పడిపోయింది.
ఏటా ఒక్కో విశిష్ట రూపం... 11 రోజుల్లో 25 లక్షల మంది భక్తుల సందర్శనం... 71 సంవత్సరాలుగా కొనసాగుతున్న మహోత్సవం... భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఖైరతాబాద్ గణేశుని ప్రత్యేకతలు అనేకం. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా దర్శనమిస్తున్న ఆ స్వామి విశేషాల మాలిక...
శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గణేశ్ ఉత్సవాలు- 2025 సన్నాహక సమావేశం మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది.
ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖలతో కర్ణన్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది.