Home » Election Commission
బిహార్‌లో పర్దానషీన్ మహిళా ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణ కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఈసీ తాజాగా ఆదేశించింది. పర్దానషీన్ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల జాబితా అవకతవకలపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ న్యాయవాది, కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ పాండే ఈ పిటిషన్ వేశారు.
బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్ హద్దులు దాడితే ఆయనపై ఉన్న 'అవినీతి ఆరోపణలు' బయటపెడతామని ఒక సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, మంత్రి అరూప్ బిశ్వాస్ కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై వివరణను ఆ లేఖలో కోరింది. ఇటీవలి కోర్టు తీర్పు నేపథ్యంలో..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థులు పెట్టే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఎన్నికల అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రజలకు కీలక సూచన చేశారు.
2020లో అసెంబ్లీ ఎన్నికలు బిహార్ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగాయి. మొత్తం 243 స్థానాలకు గాను నవంబర్ 22 వరకు ఎన్నికలు జరిగాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా గతంలో 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండగా, ఇప్పుడు దానిని 1,200 ఓటర్లకు ఒక బూత్‌గా నిర్ణయించామని సీఈసీ చెప్పారు. దీంతో అదనంగా 12,817 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎలక్షన్ కమిషన్ టీమ్ మొత్తం రెండ్రోజులుగా బిహార్‌లోనే ఉందని, రాష్ట్ర పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధిపతులు, నోడల్ అధికారులతో సమావేశాలను నిర్వహించామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.
బిహార్ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరినట్టు జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా తెలిపారు. బిహార్‌లో శాంతిభద్రతల సమస్య కానీ, నక్సల్స్ సమస్య కానీ లేవనీ, మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించిన తరహాలోనే బిహార్‌లోనూ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో కోరామన్నారు.