Home » Education
తెలంగాణలోని విద్యార్థులకు ఏవియేషన్ రంగంలో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు, అత్యుత్తమ శిక్షణ కల్పించే లక్ష్యంతో సాంకేతిక విద్యాశాఖ మరొక కీలక అడుగు వేసింది.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) కోసం ఏఐ-ఆధారిత రక్త పరీక్షను అభివృద్ధి చేయడానికి హెచ్‌సీయూ పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి రూ.4.98 కోట్ల ఐసీఎంఆర్ గ్రాంట్ లభించింది.
హైదరాబాద్, తెలంగాణను 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్'గా తీర్చిదిద్దే లక్ష్యంతో UK బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, భవిష్యత్తు పెట్టుబడులపై సీఎం కీలక ప్రకటనలు చేశారు.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న మెరిట్ ఆధారిత వెయిటేజ్ విధానానికి బదులుగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
జేఎన్‌టీయూ అనుబంధ, ప్రైవేటు అఫిలియేటెడ్ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ ఏడాది కొత్తగా డిజిలాకర్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఎస్ఎస్సీకంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి దీన్ని ఉద్దేశించారు
నల్సార్ సహా జాతీయ స్థాయిలో పేరొందిన న్యాయ కళాశాలల్లో చేరేందుకు ఉద్దేశించిన క్లాట్ ఈ ఏడాది డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకున్నప్పటికీ రాయగలిగేలా ఈ టెస్ట్ ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే ఈ టెస్ట్‌లో విజయం సాధించవచ్చన్నది నిపుణుల మాట.
విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కలెక్టర్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై వారికి పలు కీలక సూచనలు చేశారు.
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇండియా పోస్ట్ మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.