Collector: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:07 AM
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్‌పో, ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.
చిత్తూరు సెంట్రల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్‌పో, ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ఉపాధి పొందాలంటే నైపుణ్యానికి అధిక ప్రాధాన్యం ఉందని స్పష్టం చేశారు. రీజనింగ్, ఇంగ్లీష్ లెర్నింగ్, స్పీకింగ్ తదితర వాటిపై దృష్టి సారించాలన్నారు.
ఆకట్టుకున్న నమూనాలు
కెరీర్ ఎక్స్‌పోలో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. వీటిని డీఈవో రాజేంద్రప్రసాద్, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 600 మంది విద్యార్థులు, 60 మంది టీచర్లు 200 నమూనాలు ప్రదర్శించినట్లు వెల్లడించారు. వీటితోపాటు కెరీర్ మోడల్, కాంపిటీషన్, ఒకేషనల్ డ్రెస్, పోస్టర్ డ్రాయింగ్, ఆయుర్వేదం, ఆయుష్, ఫార్మసీ, బ్యాంకింగ్, సైనిక్ వెల్ఫేర్, ఇండస్ట్రీస్, ఎన్‌సీసీ, స్కిల్ డెవల్‌పమెంట్, అగ్రికల్చర్, పర్యాటక తదితర శాఖలు ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేశారన్నారు.
రాష్ట్ర స్థాయికి 15 నమూనాల ఎంపిక
15 నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కెరీర్ మోడల్ విభాగంలో.. హోటల్ మేనేమ్మెంట్ (హెచ్.నివీద, ఎస్.రేవతి, కుప్పం పరమసముద్రం కేజీబీవీ) హాస్పిటల్ (ఎస్.ఉమ్మియమ్మన్, ఎ.నిహారిక, గంగవరం కల్లుపల్లె జడ్పీహెచ్‌ఎ్‌స)ఫ కమ్యూనిటీ హెల్పర్స్ (ఎస్.తఫీమ్, వి.చందన, చౌడేపల్లె పుదిపట్ల జడ్పీహెచ్‌ఎ్‌స) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కె.పవిత్ర, పి.లిఖిత, వెదురుకుప్పం జడ్పీహెచ్‌ఎ్‌స) సుప్రీంకోర్టు (కేఎన్ శ్రీషా, కె.యోహిత, తవణంపల్లె అరగొండ ఏపీహెచ్‌ఎ్‌స (బాలికలు) పోస్టర్, డ్రాయింగ్ విభాగంలో.. డ్రాయింగ్ కెరీర్ (కె.ధర్షక్, సోమల జడ్పీహెచ్‌ఎ్‌స) ఎంటర్‌ప్రెన్యూర్ (కె.స్నేహ, చిత్తూరు గ్రీమ్స్‌పేట ఎంసీహెచ్‌ఎ్‌స) ఐఏఎస్ (వి.చరణ్‌తేజ్, పలమనేరు దొడ్డిపల్లె జడ్పీహెచ్‌ఎ్‌స), డాక్టర్ కెరీర్ ఎక్స్‌పో (జి.అమృత, పలమనేరు కొలమాసనపల్లె జడ్పీహెచ్‌ఎ్‌స) ఆస్ట్రోనేట్ (వై.చేతన్, పూతలపట్టు పోలవరం జడ్పీహెచ్‌ఎ్‌స) ఒకేషనల్/ఆక్యుపేషనల్ డ్రెస్ విభాగంలో.. ఎంట్రర్‌ప్రెన్యూర్ ఫార్మర్ (జి.భానుప్రసాద్, బంగారుపాళ్యం జీహెచ్‌ఎ్‌స) షెఫ్ (బి.అఫ్రిన్, పెనుమూరు జడ్పీహెచ్‌ఎ్‌స) ఆర్మీ (ఆర్.జ్ఞానశ్రీ, పెద్దపంజాణి అప్పినపల్లె జడ్పీహెచ్‌ఎ్‌స) క్రికెటర్ (జీఎస్ జ్ఞానేంద్ర, గుడుపల్లె యామగానిపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స) కలెక్టర్ (వి.జ్ఞానేశ్వర్, సదుం జడ్పీహెచ్‌ఎ్‌స) ఉన్నాయి. వీరంతా రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొననున్నారు.