Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:13 AM
విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
నాయుడుపేట టౌన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశాలు ఉంటాయన్నారు. సర్వశిక్ష అభియాన్ గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా విద్యార్థులు సైన్స్‌ఫెయిర్ పట్ల ఆసక్తి చూపటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను పరిశీలించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎంవో సురేష్, ఏఎంవో చంద్రశేఖర్‌నాయుడు, ఐటీ సెల్ ధనంజయ నాయుడు, జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్, డిప్యూటీ డీఈవో వసంతకుమార్, అన్ని మండలాల ఎంఈవోలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జిల్లాస్థాయి వ్యక్తిగత విభాగంలో సురే్‌షరెడ్డి (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు, గూడూరు మండలం), రాజశేఖర్ (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓబులవారిపల్లి, పాకాల మండలం), గ్రూప్ విభాగంలో అభిరామ్, సుశాంత్‌నాయక్ (ఎస్పీ జేఎన్‌ఎం సీహెచ్ ఉన్నత పాఠశాల, తిరుపతి), టి.అవంతిక, ఎస్‌డీ వసిదా (ఆరిమేనిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓజిలి మండలం), సురేంద్రకుమార్, మోక్షిత (వరగలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిల్లకూరు మండలం), లిఖిత, జశ్వంత్ (బాలిరెడ్డిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాకాడు మండలం) లక్ష్య, స్నేహ (కేవీబీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), స్వాతి, నవ్యశ్రీ (పిచ్చాటూరు జిల్లా పరిషత్ పాఠశాల), మేఘనా, ధరణి (కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), టీచర్స్ విభాగంలో శ్రీకాళహస్తి మండలం ముచ్చేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్.సుబ్రహ్మణ్యం, చిల్లకూరు ఏపీఎ్‌సడబ్ల్యూఎస్ పాఠశాలకు చెందిన సురే్‌షబాబు. వీరికి జ్ఞాపికలు అందజేశారు.