Share News

SBI Scholarship: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్స్ గురించి మీకు తెలుసా?

ABN , Publish Date - Dec 22 , 2025 | 07:00 AM

దేశంలో అతిపెద్ద భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిభగల విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు స్కాలర్‌షిప్‌లు ఇస్తుంది. సుమారు 23,230 మంది విద్యార్థులకు దాదాపు రూ. 90 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు చేస్తుంది.

SBI Scholarship: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్స్ గురించి మీకు తెలుసా?
SBI Asha Scholarship

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 22: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన సామాజిక బాధ్యతలను ప్రతిబింబిస్తూ చదువులో మెరిట్ ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం, వికలాంగులకు మద్దతు ఇవ్వడం, గ్రామాలను దత్తత తీసుకోవడం వంటి కార్యక్రమాల చేస్తుందని మీకు తెలుసా.. ఈ విధంగా ఎస్‌బీఐ దేశ నిర్మాణంలో తన పాత్రను నెరవేరుస్తోంది.

ఎస్‌బీఐ ప్రముఖ స్కాలర్‌షిప్ పథకం ఎస్‌బీఐ ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్‌షిప్ (SBI Platinum Jubilee Asha Scholarship) లేదా ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రాం. ఇది మెరిటోరియస్ (మెరిట్ ఉన్న) ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అందించే పథకం. దీనిని ఎస్‌బీఐ ఫౌండేషన్ నిర్వహిస్తుంది.

దేశంలో ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చే మెరిట్ విద్యార్థులకు విద్యను కొనసాగించేందుకు దీనిని ఉద్దేశించారు. ప్రతి ఏటా సుమారు 23,230 మంది విద్యార్థులకు దాదాపు రూ.90 కోట్లు స్కాలర్ షిప్స్ కింద ఖర్చుచేస్తున్నారు.

ఎస్‌బీఐ ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్‌షిప్ ప్రతీ ఏటా (అన్నువల్‌గా) అందిస్తారు. ఇది ఒక్కసారి మాత్రమే ఇచ్చే స్కాలర్‌షిప్ కాదు. స్కాలర్‌షిప్ రెన్యూవల్ ప్రతీ సంవత్సరం జరుగుతుంది. విద్యార్థి మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా (ఉదా: 75 శాతం మార్కులు లేదా 7 CGPA, కుటుంబ ఆదాయ లిమిట్) నిర్వహిస్తే, కోర్సు పూర్తి అయ్యే వరకు ప్రతీ ఏటా స్కాలర్‌షిప్ కొనసాగుతుంది.


స్కాలర్‌షిప్ వివరాలు:

స్కూల్ స్టూడెంట్స్ (క్లాస్ 9 నుంచి 12): రూ. 15,000 నుంచి రూ. 50,000 వరకు పర్ ఇయర్

అండర్ గ్రాడ్యుయేట్ (UG): రూ. 75,000 నుంచి ఆ చదువును బట్టి..

పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), IITలు, IIMలు, ఓవర్సీస్ స్టడీస్ విద్యార్థులకు: రూ. 20 లక్షల వరకు (కోర్సు ఫీజు ఆధారంగా).

అర్హతలు:

భారతీయ పౌరులు అయి ఉండాలి

కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 6 నుంచి 8 లక్షల లోపు ఉండాలి (పథకం ఆధారంగా మారవచ్చు)

మెరిట్:

మునుపటి పరీక్షల్లో 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి

వర్తింపు:

క్లాస్ 9 నుంచి 12, UG, PG, మెడికల్, IIT/IIM, ఓవర్సీస్ స్టడీస్ వరకు

కొన్ని కేటగిరీల్లో SC/ST, గర్ల్స్‌కు రిజర్వేషన్ (50 శాతం)

ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉండటం తప్పనిసరి (కొన్ని పథకాల్లో)

అప్లికేషన్ ప్రాసెస్:

ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి.

అధికారిక వెబ్‌సైట్: https://www.sbiashascholarship.co.in/ లేదా https://sbifoundation.in/ ద్వారా (లేదా Buddy4Study పోర్టల్ ద్వారా).

దరఖాస్తు చేసేటప్పుడు మార్క్‌షీట్లు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి.

మరిన్ని వివరాలకు అధికారిక సైట్ సందర్శించండి లేదా ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించండి.


ఇవి కూడా చదవండి..

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 22 , 2025 | 07:06 AM