Home » Earthquake
Earthquake In Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి.
మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. గం. 14:16:20 కు 12 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది.
రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.
రష్యాలో ఆదివారం మరో మారు భారీ భూకంపం కలకలం రేపింది. ఇటీవల 8.8 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఆ భూప్రకంపనల తీవ్రతకు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ స్థాయిలో బూడిద రంగు పొగ వెలువడుతూ ఆకాశాన్ని కప్పేసింది.
మనం ఎదుర్కొనే భూకంప సంఘటనలను ముందుగానే అంచనా వేయగలమా? అలాంటి మార్పులను ముందుగా తెలుసుకోవడం సాధ్యమా? ఇలాంటి ప్రమాదాలను పసిగట్టవచ్చా? శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిలీలోని బియోబియా ప్రాంతంలో 1960 మే 22న రిక్టర్ స్కేలుపై 9.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రపంచంలో ఇంతవరకూ సంభవించిన భూకంపాలలో ఇదే పెద్దది. 1,655 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
రష్యా భూకంపం అత్యంత బలమైన భూకంపాలలో ఒకటి. ఇది తీరప్రాంతంలో అలలను ఉవ్వెత్తున లేచేలా చేసింది. 8.8 తీవ్రతతో సంభవించిన ఈ తీవ్ర భూకంపం రష్యా రాజధాని మాస్కో మీద మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎందుకు?
రష్యాలో ఉదయం సంభవించిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది. జపాన్, అమెరికా సహా పలు తీరప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.
రష్యాలో 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో సముద్రాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో అలజడి రేగింది. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడి భారీ సునామీగా తీరం వైపు దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రష్యాలో 8.8 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.