6 Magnitude Earthquake: భారీ భూప్రకంపనలు.. 250 మంది మృతి!
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:09 AM
స్థానిక మీడియా కథనాల మేరకు మృతుల సంఖ్య 250కి చేరినట్లు సమాచారం. 500లకుపైగా మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 6.0గా నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 9 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక మీడియా కథనాల మేరకు మృతుల సంఖ్య 250కి చేరినట్లు సమాచారం. 500లకుపైగా మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. భూ ప్రకంపనల ధాటికి పాకిస్తాన్‌తో పాటు ఉత్తర భారత దేశంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు.
హిమాలయాల్లో పెరుగుతున్న భూకంపాలు..
ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు ఆఫ్ఘనిస్తాన్ పొరుగున ఉన్న హిమాలయన్ బెల్టులో తరచుగా భూప్రకంపనలు వస్తున్నాయి. ఇండియా, యురాసియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టుకుంటున్న కారణంగా తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. హిమాలయన్ వ్యాలీలలో ఎక్కువ మంది ప్రజలు నివసించటం, సరైన ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించటం, భూప్రకంపనల విషయంలో సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రమాదాల ద్వారా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని సైంటిస్టులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
వర్షంలో ఆడుతుండగా ఊహించని సంఘటన.. గ్రౌండ్‌లో పడ్డ పిడుగు..
నాటిన చెట్లలో బతికున్న వాటికే గ్రీన్ క్రెడిట్స్