Russia earthquake: రష్యాలో మరో భారీ భూకంపం.. 7.1 తీవ్రత నమోదు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 09:04 AM
రష్యాను మరోసారి భారీ భూకంపం వణికించింది. నెల రోజుల క్రితం 8.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కామ్చాట్కా తీరంలోనే తాజా భూకంపం కూడా వచ్చింది. ఈ సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది.
రష్యాను మరోసారి భారీ భూకంపం వణికించింది. నెల రోజుల క్రితం 8.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కామ్చాట్కా తీరంలోనే తాజా భూకంపం కూడా వచ్చింది. ఈ సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. ఈ భూకంప విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ వెల్లడించింది.
39.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక సంస్థ ప్రకటన వెల్లడించింది. అటు జపాన్‌లో కూడా ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ కాలేదు. నెల రోజుల క్రితం కూడా కామ్చాట్కా తీరంలోనే భారీ భూకంపం సంభవించింది. అప్పుడు సునామీ కూడా వచ్చింది.
ఇవి కూడా చదవండి..
బరువు తగ్గండి.. లక్షలు సంపాదించండి.. ఉద్యోగులకు ఓ కంపెనీ ఆఫర్..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..