Home » Droupadi Murmu
పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు జరిపిన పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు.
పశ్చిమ బెంగాల్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ముని మమతా ప్రభుత్వం అవమానించిందన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సంతల్ సమావేశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సంతల్ సమాజం సంస్కృతి భాగస్వామ్యం, గౌరవాన్ని కొనసాగించాలని సూచించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమబెంగాల్‌లో పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 2025 ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ తాను జారీ చేసిన ఆదేశాలను రద్దు చేశారు.
నేడు (ఫిబ్రవరి 1, 2026) కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఇది ఏటా జరిగే ఒక ముఖ్యమైన రాజ్యాంగ, ఇంకా గౌరవప్రదమైన సాంప్రదాయం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు.
గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.
భారత 77వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.
ఈరోజు భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర ఘనంగా జరుపుకుంటోంది. 'వందే మాతరం' రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని వారసత్వాన్ని ఘనంగా స్మరించుకోవడంతోపాటు, పరేడ్ లోని పది ప్రత్యేకతలేంటో చూద్దాం.