President Draupadi Murmu: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:48 PM
ప్రతి ఏడాది రాష్ట్రపతి హోదాలో ఉన్నవారు శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది కోసం హైదరాబాద్‌కు విచ్చేశారు. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు హైదరాబాద్ కు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 17 నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హకీంపేట, అల్వాల్, బొలారం, తిరుమలగిరి, కార్కానా ప్రాంతాల్లో వాహనాల డైవర్షన్ కొనసాగుతుంది.
రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు డ్రోన్లు, పారా గ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఎగురవేతపై నిషేధం. 18న సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిలిమ్ సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. పలు అభివృద్ది శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న రాష్ట్రపతి నిలయంలో ప్రముఖల కోసం ‘ఎట్ హోమ్’, పౌరుల భేటీ లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
ఇవి కూడా చదవండి...
ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు
ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..