Home » Donald Trump
భారత్‌తో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు రాయబారిగా తనకు సన్నిహితుడైన సెర్గియో గోర్‌ను నియమించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఆయన మాజీ సలహాదారు జాన్ బోల్టన్‌పై అమెరికా అత్యున్నత దర్యాప్తు ...
ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ సర్కారు తాజాగా ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, అమెరికన్ల ఉపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో తెలిపారు.
ట్రంప్ సుంకాల కారణంగా భారత్ అమెరికా దౌత్య బంధంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ అన్నారు. భారతీయులు గుణపాఠం నేర్చుకున్నారని, ఇక అమెరికాను నమ్మరని కామెంట్ చేశారు.
ట్రంప్‌తో అలాస్కాలో సమావేశం సందర్భంగా పుతిన్ స్థానికుడు ఒకరికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.19 లక్షలు ఖరీదు చేసే రష్యా బైక్‌ను బహుమతిగా ఇచ్చారు.
భారత్ వంటి మిత్ర దేశాన్ని కోల్పోవడం భారీ వ్యూహాత్మక తప్పిదమవుతుందని దక్షిణ కెరొలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ట్రంప్ ప్రభుత్వానికి హితవు పలికారు. భారత్, అమెరికా దౌత్య బంధాన్ని తక్షణం చక్కదిద్దాలని సూచించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు భారతదేశ ఎగుమతిదారులకు ఊహించని సవాళ్లను తీసుకొస్తున్నాయి. ఈ సుంకాల ప్రభావం సుమారు $48.2 బిలియన్ విలువైన భారత వస్తువులపై పడనుంది. దీంతో మన దేశ వ్యాపారులు, పరిశ్రమలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సుంది.
త్వరలో పుతిన్, జెలెన్స్కీ భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. శాంతి స్థాపన దిశగా ఇది తొలి అడుగని కూడా వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌కు రక్షణగా నిలుస్తామని.. శాంతి కోసం అవసరమైతే అమెరికా దళాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. యూరప్ దేశాలు ముందు నిలుస్తాయని, తాము వీలైనంత సహాయం చేస్తామని చెప్పారు.....
రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనాను వదిలిపెట్టి భారత్‌పై సుంకాల వడ్డనకు కారణాలను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి తాజాగా వివరించారు. రష్యా చమురులో అధిక శాతాన్ని చైనా శుద్ధి చేసి మళ్లీ ఎగుమతి చేస్తోందని, ఈ దశలో సుంకాలు విధిస్తే మార్కెట్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.