Share News

America shutdown 2025: అమెరికా షట్‌డౌన్.. ట్రంప్ అధ్యక్షతన రెండోసారి..

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:26 AM

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అయింది. కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. గత ఏడేళ్లలో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కోవడం ఇదే తొలిసారి.

America shutdown 2025: అమెరికా షట్‌డౌన్.. ట్రంప్ అధ్యక్షతన రెండోసారి..
U.S. government shutdown

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అయింది. కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. గత ఏడేళ్లలో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు 2018-19 మధ్యలో దాదాపు 35 రోజుల పాటు అమెరికా ప్రభుత్వం మూతపడింది. అప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘ షట్‌డౌన్‌గా నిలిచింది. మరి, ఈ సారి ఈ షట్‌డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి (U.S. government shutdown).


నవంబర్ 21వ తేదీ వరకు ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అనుమతించే స్వల్పకాలిక వ్యయ బిల్లును సెనెట్ తిరస్కరించడంతో షట్‌డౌన్ ప్రారంభమైంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చుల విషయంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలే ఈ షట్‌డౌన్‌కు కారణం. ఈ ఏడాది చివరితో ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల గడువు ముగుస్తోంది. ఆ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల పొడిగింపును ఈ తాత్కాలిక నిధుల ప్యాకేజీలో చేర్చాలని డెమొక్రాట్లు డిమండ్ చేశారు. ఆ డిమాండ్‌ను రిపబ్లికన్లు తిరస్కరించారు (federal funding lapse).


తమ డిమాండ్‌కు అంగీకరించకపోవడంతో స్వల్ప కాలిక వ్యయ బిల్లును డెమొక్రాట్లు వ్యతిరేకించారు (government shutdown news). మంగళవారం సాయంత్రం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 55 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 45 ఓట్లు పడ్డాయి. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఏదైనా బిల్లు అమోదం పొందాలంటే కనీసం 60 ఓట్లు అవసరం. దీంతో ఆ బిల్లు తిరస్కరణకు గురైంది. ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన నిధుల బిల్లు పాస్ కాకపోవడంతో ప్రభుత్వం మూతపడింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతి నుంచి షట్‌డౌన్ అయినట్టే.


Also Read:

పనిమనిషి ఫిర్యాదు.. హీరోయిన్ డింపుల్ హయతీపై..

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ఎండ్!

ముందు సిమెంట్‌.. వెనుక గంజాయి

For More International News and Telugu News..

Updated Date - Oct 01 , 2025 | 11:37 AM