Share News

Trump Ultimatum: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటమ్.. దారికి రాకపోతే నరకం మొదలవుతుందంటూ వార్నింగ్

ABN , Publish Date - Oct 03 , 2025 | 09:22 PM

శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు హమాస్‌కు ఆదివారం సాయంత్రం వరకే సమయం ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ తరువాత నరకం మొదలవుతుందని హెచ్చరించారు.

Trump Ultimatum: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటమ్.. దారికి రాకపోతే నరకం మొదలవుతుందంటూ వార్నింగ్
Trump Hamas deal deadline

ఇంటర్నెట్ డెస్క్: ఉగ్ర సంస్థ హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారీ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్‌తో సంధి కుదుర్చుకునేందుకు ఆదివారం 6 గంటల వరకే సమయం ఉందని అన్నారు. ఈ డెడ్‌లైన్ దాటితే నరకం తప్పదని హెచ్చరిస్తున్నారు. యుద్ధం ముగించేందుకు హమాస్‌కు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఏదోక మార్గంలో శాంతిస్థాపన జరిగి తీరుతుందని అన్నారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కుదిర్చేందుకు ట్రంప్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. యుద్ధం ముగింపునకు 20 అంశాలతో కూడిన ప్రతిపాదనను తాజాగా ముందుకు తెచ్చారు. యుద్ధం తరువాత గాజాలో పరిపాలన పునరుద్ధరణకు ప్రణాళిక, తక్షణ కాల్పుల విరమణ తదితర ఒప్పందాలను ప్రస్తావించారు. శాంతిస్థాపనకు ఇది రోడ్ మ్యాప్ అని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక తాజా డెడ్‌లైన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌పై జరిపిన దాడిని మారణ హోమంగా ఆయన అభివర్ణించారు. ఆ దాడిలో శిశువులు, మహిళలు మరణించారని అన్నారు. ఇందుకు ప్రతీకారంగా 25 వేల హమాస్‌ సైనికులు కూడా బలయ్యారని అన్నారు.


గాజాలో అనేక మంది అమాయక పాలస్తీనా ప్రజలు దాడుల్లో చిక్కుకున్నారని అన్నారు. గాజాలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరింత మంది ఈ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకుంటారని అన్నారు. హమాస్ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో తమకు తెలుసని, వాళ్లందరినీ వెంటాడి అంతమొందిస్తామని హెచ్చరించారు.

ఇక ట్రంప్ ప్రకటన ప్రకారం, యుద్ధం ముగింపు తరువాత గాజాలో ఓ టెంపరరీ గవర్నింగ్ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రతిపాదనలను హమాస్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. అయితే, తాము ఆయుధాలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేమని హమాస్ మొదటి నుంచి చెబుతోంది. ప్రస్తుత ప్రతిపాదనలోని అంశాలన్నీ గతంలో ఏదోక సందర్భంలో చెప్పినవేనని హమాస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్‌తో మిగులున్న హమాస్ ఫైటర్లు ప్రాణాలతో బయటపడతారని ట్రంప్ అన్నారు. ఇది అందరికీ ప్రయోజనకరమైన డీల్ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

కశ్మీర్ అంశం.. భారత్, పాక్‌ల ద్వైపాక్షిక వ్యవహారమే: శ్వేత సౌధం అధికారి

ట్రంప్ మళ్లీ షాకింగ్ ప్రకటన..భారత ఔషధ ఎగుమతులకు దెబ్బ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 10:05 PM