Home » Donald Trump
సుంకాల విధింపు చట్టప్రకారం చెల్లదంటూ యూఎస్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ సర్కారు సుప్రీం కోర్టులో తాజాగా సవాలు చేసింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్‌పై సుంకాలు విధించడం అవసరమని తన పిటిషన్‌లో పేర్కొంది.
'వద్దన్నా వినకుండా పాకిస్థాన్‌తో కయ్యానికి కాలు దువ్వింది భారత్. ఆరు ఫైటర్ జెట్లను కూల్చేయడంతో మా వద్దకు కాల్పుల విరమణ ఒప్పందం చేయమని కాళ్లబేరానికి వచ్చిందంటూ' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియో నిజమా? నకిలీనా? అనే సందేహాలు నెటిజన్లలో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చబోతున్నారు. ఇప్పటికే 50 శాతం దిగుమతి సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ఆయన.. భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 200 శాతం పన్నులు వేయబోతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌తో వ్యవహరించిన వైఖరితో ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నట్టు కనిపిస్తోంది. తన టారిఫ్స్ తెచ్చిన చిక్కుల్ని, స్వదేశంలో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ పలుమార్లు తన స్వంత డప్పు కొట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ భారత్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామిక విలువలపరంగా భారత్ అమెరికాకే దగ్గరని అన్నారు. అయితే, భారత్ తీసుకునే తప్పు చర్యల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ జాతీయ భద్రతా సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో తన కుటుంబ వ్యాపారాల కోసమే భారత్‌తో బంధాన్ని కాదనుకున్నారని ఆరోపించారు. ఇది పెద్ద వ్యూహాత్మక తప్పిదమని హెచ్చరించారు.
భారత్‌పై తాము విధించినట్లే యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా అదనపు సుంకాలు వేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.
భారత్ అమెరికాపై సుంకాలను పూర్తిగా తగ్గించేందుకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటికే భారత్ చాలా ఆలస్యం చేసిందని కామెంట్ చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఈ మేరకు పోస్టు పెట్టారు.
భారత్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా ఐరోపా దేశాలను అభ్యర్థించినట్టు తెలుస్తోంది. అయితే.. ఐరోపా దేశాలు ఈ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
క్వాడ్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వస్తానని తొలుత చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆ ప్లాన్‌ను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.