Share News

Trumps AI Video Response: ‘నో కింగ్స్’ నిరసనలు.. ఏఐ వీడియోతో సమాధానం ఇచ్చిన ట్రంప్

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:39 PM

ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ ట్రూత్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ఆయనకు సంబంధించిన ఏఐ వీడియో.

Trumps AI Video Response: ‘నో కింగ్స్’ నిరసనలు.. ఏఐ వీడియోతో సమాధానం ఇచ్చిన ట్రంప్
Trumps AI Video Response

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ‘నో కింగ్స్’ పేరిట అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలపై ట్రంప్ శనివారం స్పందించారు. ఫాక్స్‌ బిజినెస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ నిరసనకారులు నన్ను రాజునని అంటున్నారు. కానీ నేను రాజుని కాదు. డెమోక్రాట్స్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు’ అని అన్నారు.


ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ ట్రూత్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది ఆయనకు సంబంధించిన ఏఐ వీడియో. ఆ వీడియోతో నిరసనకారులకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఆ వీడియోలో ఏముందంటే.. అధ్యక్షుడు ట్రంప్ ఫైటర్ జెట్ నడుపుతూ ఉన్నారు. నిరసనకారులు ఉన్న చోటుకు వచ్చారు. ఫైటర్ జెట్ నుంచి నిరసనకారులపై పెద్ద మొత్తంలో బురద చల్లారు. నిరసనకారులు ఆ బురదలో తడిసి ముద్దయిపోయారు.


25 వేల మంది సేఫ్..

డ్రగ్స్ రవాణా చేస్తున్న సబ్ మెరైన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. శనివారం జరిగిన ఈ దాడిలో సబ్‌ మెరైన్ ధ్వంసం అయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరిని అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. కొన్ని గంటల తర్వాత వారిని సొంత దేశాలకు పంపేసింది. దీనిపై ట్రంప్ స్పందించారు. ఆ సబ్ మెరైన్ అమెరికా తీరానికి చేరుకుని ఉంటే 25 వేల మంది దాకా చనిపోయి ఉండేవారని అన్నారు. తన దృష్టిని దాటి భూభాగం నుంచి కానీ, సముద్రం నుంచి కానీ డ్రగ్స్ అమెరికాలోకి రాలేవని ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

అల్పాహారంలో పురుగులు.. హోటల్ యజమాన్యానికి షాక్ ఇచ్చిన అధికారులు

గాజాపై దాడులకు సిద్ధమైన హమాస్.. అమెరికా వార్నింగ్..

Updated Date - Oct 19 , 2025 | 01:56 PM