Share News

US Warns Of Hamas Plot: గాజాపై దాడులకు సిద్ధమైన హమాస్.. అమెరికా వార్నింగ్..

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:52 PM

గాజా పౌరులపై దాడి చేయడానికి హమాస్ ప్లాన్ చేసిందట. ఈ విషయాలు విశ్వసనీయ వర్గాల ద్వారా అమెరికాకు చేరాయి. దీంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

US Warns Of Hamas Plot: గాజాపై దాడులకు సిద్ధమైన హమాస్.. అమెరికా వార్నింగ్..
US Warns Of Hamas Plot

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ కారణంగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ఆగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గాజా పౌరులపై దాడి చేయడానికి హమాస్ ప్లాన్ చేసిందట. ఈ విషయాలు విశ్వసనీయ వర్గాల ద్వారా అమెరికాకు చేరాయి. దీంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.


ఆ ప్రకటనలో.. ‘గాజా పౌరులపై దాడులకు హమాస్‌ ప్లాన్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదు. గాజా ప్రజలను రక్షించడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధం. ఈ దాడి సమాచారాన్ని శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న ఈజిప్ట్, తుర్కియే, ఖతార్ దేశాలకు తెలియ జేశాము’ అని అమెరికా తెలిపింది. అంతకు క్రితం ట్రంప్ కూడా హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. ‘హమాస్ గాజాలోని ప్రజల్ని చంపుకుంటూ పోతే సహించం. హమాస్‌ను అంతం చేయటం తప్పితే మాకు వేరే దారి లేదు’ అని అన్నారు.


అమెరికా వార్నింగ్ నేపథ్యంలో హమాస్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకే వేళ హమాస్ గాజాలోని పౌరులపై దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు మాత్రం తప్పవు. అమెరికా నేరుగా యుద్ధానికి దిగే అవకాశం ఉంది. అమెరికా రంగంలోకి దిగితే హమాస్ తుడిచిపెట్టుకపోవాల్సిందే.


ఇవి కూడా చదవండి

రైలు ప్రయాణంలో పక్కకు జరిగిన దవడ.. డాక్టర్ ఏం చేశాడంటే..

బంద్‌ వేళ దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్

Updated Date - Oct 19 , 2025 | 01:46 PM