Railway Doctor Save Passenger: రైలు ప్రయాణంలో పక్కకు జరిగిన దవడ.. డాక్టర్ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:10 PM
24 ఏళ్ల ఓ యువకుడు కన్యాకుమారి - డిబ్రూగర్ రైలులో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి దవడ ఎముక పక్కకు జరిగింది.
రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి వింత అనుభవం ఎదురైంది. అతడి దవడ ఎముక పక్కకు జరిగింది. దీంతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది మొదలైంది. ఒక రకంగా అతడి ప్రాణాల మీదకు వచ్చింది. అలాంటి సమయంలో ఓ డాక్టర్ రంగంలోకి దిగి అతడ్ని కాపాడాడు. దవడ ఎముకను క్షణాల్లో సరి చేశాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల ఓ యువకుడు కన్యాకుమారి - డిబ్రూగర్ రైలులో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి దవడ ఎముక పక్కకు జరిగింది.
నోరు మూయలేని పరిస్థితి ఏర్పడింది. యువకుడు నొప్పితో అల్లాడిపోసాగాడు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారుకులకు సమాచారం వెళ్లింది. అధికారులు పాలక్కాడ్ దగ్గర డాక్టర్‌ను ఏర్పాటు చేశారు. రైలు పాలక్కాడ్ రాగానే డాక్టర్ వైద్యం చేశాడు. క్షణాల్లో దవడను సరి చేశాడు. యువకుడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ డాక్టర్ చాలా సింపుల్‌గా దవడను సరి చేశాడు. చాలా గ్రేట్’..
‘రైల్వే అధికారులు చాలా త్వరగా స్పందించారు. లేదంటే అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఊరికి వెళ్లేలోపు ప్రాణం కూడా పోయేది’..‘నిద్రలో ఉన్నపుడు, ఆవలించినపుడు కూడా ఇలా దవడ పక్కకు జరుగుతుంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొన్ని సార్లు డాక్టర్ల అవసరం ఉంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బంద్ వేళ దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
మనసున్న మగామె.. ఈ జానూ.. ఇప్పుడు జానమ్మ!