Share News

No Kings Trump: మిస్టర్ ట్రంప్.. మాకు రాజులు వద్దు.. అమెరికాలో భారీ నిరసనలు..

ABN , Publish Date - Oct 19 , 2025 | 06:59 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశవాసులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. ట్రంప్‌ నిరంకుశత్వాన్ని సహించబోమని లక్షలాది మంది అమెరికన్లు శనివారం రోడ్ల పైకి వచ్చి నినదించారు.

No Kings Trump: మిస్టర్ ట్రంప్.. మాకు రాజులు వద్దు.. అమెరికాలో భారీ నిరసనలు..
anti-Trump protests

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశవాసులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. ట్రంప్‌ నిరంకుశత్వాన్ని సహించబోమని లక్షలాది మంది అమెరికన్లు శనివారం రోడ్ల పైకి వచ్చి నినదించారు. ట్రంప్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 50 రాష్ట్రాలలోని 2,500కు పైగా ప్రాంతాల్లో నో కింగ్స్‌ (రాజులు లేరు) నిరసనలు ప్రారంభమయ్యాయి (anti-Trump protests).


అమెరికాలో రాజులు లేరని, అరాచకానికి, అవినీతికి, క్రూరత్వానికి లొంగేది లేదు అని నిర్వాహకులు స్పష్టం చేశారు. ట్రంప్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లక్షలాదిమంది ప్రజలు ఎక్కడికక్కడ సమూహాలుగా ఏర్పడి రోడ్ల మీద నిరసనలు తెలియచేశారు. తాము అమెరికాను ప్రేమిస్తామని, ఓ రాజుకు తమ దేశాన్ని అప్పగించలేమని నినాదాలు చేశారు. కాగా, ఈ నిరసనలను అమెరికా వ్యతిరేక నిరసనలుగా రిపబ్లికన్లు కొట్టి పారేశారు. ఇవి అమెరికా విద్వేష నిరసనలని, నేషనల్‌ గార్డులను బయటకు రప్పించాల్సిన సమయం ఆసన్నమైందని కన్సాస్‌ సెనేటర్‌ రోజెర్‌ మార్షల్‌ చెప్పారు (U.S. resistance movement).


నిరసనకారులు తనను చక్రవర్తిగా సంబోధిస్తున్నారని, కాని తాను చక్రవర్తిని కానని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు (democracy protests USA). ఈ భారీ నిరసనల నేపథ్యంలో అమెరికాలోని ఆయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. కాగా, అమెరికాలో జరుగుతున్న నో కింగ్స్‌ నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తూ యూరప్‌లోనూ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రజాస్వామిక విలువలను పాటించడం లేదని బెర్లిన్‌, పారిస్‌, రోమ్‌, స్వీడన్‌లోని అమెరికా ఎంబసీల వెలుపల నిరసనకారులు నినదించారు.


ఇవి కూడా చదవండి..

తీరుమారని పాక్ ఆర్మీ చీఫ్.. మళ్లీ అణు బెదిరింపు వ్యాఖ్యలు

అఫ్ఘానిస్థానీలు మా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే: పాక్ రక్షణ శాఖ మంత్రి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 19 , 2025 | 06:59 AM