Home » Diwali 2025
పాత తరానికి పరిచయమైన మందుగుండు సామగ్రితో పాటు, నేటి తరం ఆలోచనలకు అనువైన టపాసులను ఈ దీపావళికి మార్కెట్లోకి వచ్చాయి. దీపావళి పండుగకు కళను తీసుకొచ్చే క్రాకర్స్ దుకాణాలు నగరంలో పలుచోట్ల ఏర్పాటయ్యాయి.
తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఉదయనిధి ఒక పబ్లిక్ మీటింగ్‌లో శుభాకాంక్షలు చెప్పాలా.. వద్దా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయంటూ మాట్లాడారు.
సదర్ వేడుకల్లో కేరళనుంచి తీసుకువచ్చిన గుమన్ కాళీ అనే దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2500 కేజీల బరువు, 7 అడుగుల వెడల్పు ఉన్న ఆ దున్నరాజు ధర 25 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.
హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని P&T కాలనీలో చోటుచేసుకుంది. పార్క్ చేసిన కారు కింద టపాసులు పేలాయి. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో లక్ష్మీ దేవిని పూజించి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, స్వీయ-అభివృద్ధికి కూడా ఒక అవకాశం.
భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఏటా దీపావళి రోజున గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. ఈ సారి దీపావళి విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. వాస్తవానికి దీపావళిని అందరూ సోమవారం (అక్టోబర్ 20) జరుపుకుంటున్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు రేవంత్. దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ప్రగతి వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. అజ్ఞానపు తమస్సును తొలగించుకుని, ప్రతీ మనిషి తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫైర్ క్రాకర్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది.
జీఎస్టీ సెలబ్రేషన్స్‌ని దసరాతో ప్రారంభించి దీపావళితో ముగిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇటువంటి పండగలు జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. సూపర్ జీఎస్టీ పండుగను వ్యాపారస్తులంతా చాలా చక్కగా జరుపుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు.