Home » Devotees
దసరా ఉత్సవాల సందర్భంగా చేపట్టే పనులు శరవేగంగా జరిగే విధంగా చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు 11 రోజులు జరుగనున్నాయని తెలిపారు. గతం కంటే ఘనంగా ఉత్సవాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కొండపై రద్దీ నెలకొంది.
అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉద్యోగులు 36 ఏళ్ల కిందట నిజం చేశారు. రూ.50 వేలను విరాళంగా సమర్పించి పెద్దమనసుతో నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ చేశారు.
దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల లగేజీకి భద్రత కరువైంది. రోజూ వేలమంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఆలయంలో తమ బ్యాగులకు కనీస భద్రత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే మండపాల్లో కొలువుదీరుస్తున్నారు.
ఏఐ టెక్నాలజీని వినియోగించి భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదంటూ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు చేశారని టీటీడీ చైర్మన్ విమర్శించారు.
అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.
తిరుమలలో వేంకటేశ్వర స్వామిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.