Home » Deputy CM Pawan Kalyan
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకొని ఉపాధ్యాయులు సంతోషిస్తారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలీ ప్రీతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో భవిష్యత్తులో.. ఎయిర్‌పోర్ట్స్, పోర్టులు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్స్‌కి ఒక పోర్ట్.. నిర్మించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీ ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాలలో చాలా స్ట్రాంగ్‌గా ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని డిప్యూటీ సీఎం పవన్ కొనియాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీలో చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. పారిశుధ్యంపై శాఖల వారీగా తీసుకన్న రిపోర్టులు ఆధారంగా అవార్డులకు ఎంపిక ఉటుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పనిచేసిన వారిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రుషికొండ టూరిజం రిసార్ట్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం వాడుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ రిసార్టును మేజర్‌గా ఎలా వినియోగించాలో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.