Home » Delhi High Court
ప్రధాని పిక్‌పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దాఖలైన పిల్‌లో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌పై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.
కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ( Delhi High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై మూడు నెలల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది.
ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా అధికార నివాసం కూడా ఖాళీ చేయాల్సి రావడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు వాయిదా వేసింది. పిటిషన్‌పై 'స్టే' ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను 2024 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
సరోగసీపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతదేశంలో ఈ పరిశ్రమని ప్రోత్సాహించకూడదని బుధవారం అభిప్రాయపడింది. సరోగసీ రూల్స్‌లోని రూల్ 7 ప్రకారం.. ఫారం 2ను మార్చడం ద్వారా సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ...
రాజకీయ కూటములను నియంత్రించే చట్టబద్ధమైన అధికారాలు తమకు లేవని ఢిల్లీ హైకోర్టుకు భారత ఎన్నికల కమిషన్ తెలియజేసింది. 26 పార్టీల కూటమికి 'ఇండియా' పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టుకు ఈసీ సోమవారం తమ అభిప్రాయాన్ని తెలియచేసింది.
ఢిల్లీ హైకోర్టు ప్రేమ పెళ్లిపై గురువారం సంచలనం తీర్పు ఇచ్చింది. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. కుటుంబ సభ్యులు అలాంటి వివాహాలకు అభ్యంతరం చెప్పలేరని...
లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ సింగ్ కు ఢిల్లీ హైకోర్టులో శుక్రవారంనాడు చుక్కెదురైంది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కేసు ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.
ప్రభుత్వ బంగ్లా విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై రాఘవ్ చద్దా ఒక ట్వీట్‌లో తన స్పందన తెలిపారు. ఈ పోరాటం ఒక ఇంటి కోసమో, దుకాణం కోసమే కాదని, రాజ్యాంగాన్ని రక్షించేందుకని ట్వీట్ చేశారు.
లైఫ్ పార్ట్‌నర్ కావాలని భర్తతో శృంగారంలో పాల్గొనకపోవడం క్రూరత్వమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్త అభ్యర్థన మేరకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. వైవాహిక బంధంలో సెక్సువల్ లైఫ్ దూరం కావడం అంత దారుణం మరోటి ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసి దాన్ని పరిష్కరించాలని కోరాడు. అయితే జడ్జి ఆ కేసును తిరస్కరించాడు. దీంతో ఆ జడ్జినే ఉరితీయాలి అంటూ అతను ఏకంగా హైకోర్టుకు వెళ్లాడు.