Share News

Delhi High Court: ఆధార్ విషయంలో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ

ABN , Publish Date - Dec 21 , 2023 | 03:30 PM

కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ( Delhi High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై మూడు నెలల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది.

 Delhi High Court: ఆధార్ విషయంలో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. స్థిర, చరాస్తులను ఆధార్‌కి అనుసంధానం చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(పిల్‌) విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ సూచనలు చేసింది. దేశంలో నల్లధనం, అవినీతి, బినామీల నివారణకు ఆధార్‌తో అనుసంధానం ఒక కీలక చర్య అవుతుందని పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పూర్తి పరిశీలన అనంతరం విచారణ ముగించినట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలను ఒక విజ్ఞాపనగా తీసుకుని పరిశీలించాలని కేంద్రానికి సూచన చేసింది.

Updated Date - Dec 21 , 2023 | 03:35 PM