Share News

Delhi excise policy case: ఈడీ సమన్లను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్

ABN , Publish Date - Mar 19 , 2024 | 08:47 PM

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కింద తనకు ఇంతవరకూ జారీ చేసిన సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరుపనుంది.

Delhi excise policy case: ఈడీ సమన్లను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కింద తనకు ఇంతవరకూ జారీ చేసిన సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టు (Delhi High court)లో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం బుధవారంనాడు విచారణ జరుపనుంది.


ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 21న తమ ముందు హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ గత ఆదివారంనాడు తొమ్మిదోసారి సమన్లు పంపింది. గతంలో జారీ చేసిన ఎనిమిది సమన్లలో ఆరింటికి గైర్హాజర్‌ అయ్యారంటూ ఈడీ ఇచ్చిన రెండు ఫిర్యాదులపై కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిలు మంజూరు చేసిన మరుసటి రోజే ఆయనకు ఈడీ తాజా సమన్లు పంపడం విశేషం. కాగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ ఇంతవరకూ ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయిర్, కొందరు లిక్కర్ వ్యాపారులను అరెస్టు చేసింది. బీఆర్ఎస్ నేత కె.కవితను గతవారంలో అరెస్టు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 08:47 PM