Home » Cyber attack
పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్ చూస్తుండగా, నోమురా యాప్ ప్రమోషన్ వీడియో కనిపించింది.
‘మీపై మనీల్యాండరింగ్ కేసులు నమోదు అయ్యాయి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అంటూ బెదిరిగించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వృద్ధుడి నుంచి రూ.21లక్షలు దోచేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు. ముంబై పోలీస్ అధికారుల్లా పరిచయం చేసుకున్నారు.
పీఎం కిసాన్ యోజన పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకొని బాధితుడి ఖాతా నుంచి రూ2.90 లక్షలు బదిలీ చేసుకున్నారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో ఏపీకే లింక్ పంపారు.
లాటరీ, ఆఫర్, డిస్కౌంట్ అంటూ ఏపీకే లింక్‌లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కరెంట్ బిల్లు పెండింగ్, వాటర్ బిల్లు, పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వల వేస్తున్నారు. చివరికి పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షలు అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు.
మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.
దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానికి అనుబంధంగా సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో మోసం eSIM స్కామ్. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వివాహ సంబంధిత వెబ్‌సైట్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. పంజాగుట్టకు చెందిన యువకుడి (31)కి రెడ్డి మ్యాట్రిమోని సైట్‌లో ఓ యువతి పరిచయమైంది.
మీకు మానవ అక్రమరవాణా గ్యాంగుతో సంబంధాలున్నాయని, అరెస్ట్ వారెంట్ వచ్చిందని ఓ వృద్ధుడిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు అతని నుంచి రూ.33.40 లక్షలు వసూలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బోయినపల్లికి చెందిన వృద్ధుడి(73)కి జూలై 25న ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి తనను తాను కర్నాటక క్రైం బ్రాంచ్ అధికారి గౌరవ్ సారథిగా పరిచయం చేసుకున్నాడు.
సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. పునీత్ కంపెనీలో సైబర్ మోసానికి పాల్పడ్డారు. పునీత్ పేరుతో తన అకౌంటెంట్‌కు సైబర్ కేటుగాళ్ల మెసేజ్ చేశారు. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ.. అకౌంట్‌కు డబ్బులు పంపుమని మెసేజ్ పంపారు.