Share News

Hyderabad: ఏపీకే లింక్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌ చేసి..

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:56 AM

పీఎం కిసాన్‌, ఆర్‌టీఓ చలాన్‌ పేర్లతో ఏపీకే లింక్‌లను పంపి ఇద్దరు నగరవాసులను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు రూ.2.47 లక్షలు కాజేశారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (29) ఫోన్‌కు ‘పీఎం కిసాన్‌’ పేరుతో ఏపీకే లింక్‌ పంపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.

Hyderabad: ఏపీకే లింక్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌ చేసి..

- రూ.2.47 లక్షలు స్వాహా

హైదరాబాద్‌ సిటీ: పీఎం కిసాన్‌, ఆర్‌టీఓ చలాన్‌(PM Kisan, RTO Challan) పేర్లతో ఏపీకే లింక్‌లను పంపి ఇద్దరు నగరవాసులను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు రూ.2.47 లక్షలు కాజేశారు. దోమలగూడ(Domalguda) ప్రాంతానికి చెందిన వ్యక్తి (29) ఫోన్‌కు ‘పీఎం కిసాన్‌’ పేరుతో ఏపీకే లింక్‌ పంపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. నిజమని నమ్మిన బాధితుడు లింక్‌ను తెరిచి వివరాలు నమోదు చేశాడు.


city1.2.jpg

మాల్‌వేర్‌ సాయంతో అతడి ఫోన్‌ను హ్యాక్‌ చేసిన నేరగాళ్లు రూ. లక్షను ఇతర ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఇదే తరహాలో మంగళ్‌హాట్‌(Mangalhat) ప్రాంతానికి చెందిన వ్యక్తి (41) ఫోన్‌కు ఆర్‌టీఏ ఈ చలాన్‌ పేరుతో ఏపీకే లింక్‌ పంపి రూ.1.47 లక్షలు కాజేశారు. కేసులు దర్యాప్తులో ఉన్నాయి.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 01 , 2025 | 07:08 AM