SIM Swap Attack: మీ మొబైల్ సిమ్ కార్డ్‌లు హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు జాగ్రత్త
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:35 PM
మొబైల్ ఫోన్ల సిమ్ కార్డులు హ్యాక్ చేసి 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్‌ను తమ నియంత్రణలోకి తీసుకుని, ఆ నంబర్‌కు లింకైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని..
ఇంటర్నెట్ డెస్క్: సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్తగా మొబైల్ ఫోన్లలో ఉపయోగించే సిమ్ కార్డుల ద్వారా 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సిమ్ స్వాప్ అంటే.. రెండు అంచెల రక్షణ వ్యవస్థలోని (Two-Factor Authentication - 2FA)లోపాన్ని ఉపయోగించుకుని వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసే పద్ధతి.
ఈ తరహా మోసాల్లో సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటారు. ఆ నంబర్‌కు అనుసంధానమైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. డూప్లికేట్ సిమ్ కార్డుకు, వినియోగదారుని ఒరిజినల్ SIM కార్డును అనుసంధానించి ఉపయోగిస్తారు. తద్వారా ఆ మొబైల్ నెంబర్ మీదున్న బ్యాంక్ లేదా ఇతర ఆన్‌లైన్ ఖాతాలకు పంపే OTP (One-Time Password)లు మోసగాళ్లకు చేరుతాయి. దీనితో వారు ఖాతాలను ఎటువంటి ఆటంకం లేకుండా ఆపరేట్ చేసి, వారి సొంత ఖాతాల్లోకి డబ్బులు స్వాహా చేస్తారు.
మొదట, మోసగాళ్లు ఫిషింగ్ మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా వినియోగదారుని వ్యక్తిగత సమాచారం (ఏదైనా ID, ఫోన్ నంబర్) సేకరిస్తారు. ఆ తర్వాత, వారు ఆపరేటర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, వినియోగదారుని గురించి తస్కరించిన సమాచారంతో SIM స్వాప్‌ను అభ్యర్థిస్తారు. కొన్ని సందర్భాల్లో, వారు వినియోగదారుని సహకారంతో లేదా మోసపూరిత అనుమతులతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
దీనిని ఎలా నివారించాలి?
SIM స్వాప్ మోసం బారిన పడకుండా కొన్ని సాధ్యమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. SIM ప్రొటెక్షన్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేయండి. మీ మొబైల్ ఆపరేటర్ అందించే SIM స్వాప్‌ను నిరోధించే రక్షణ సేవను ఉపయోగించండి.
బలమైన పాస్‌వర్డ్‌లు:
మీ ఆన్‌లైన్ ఖాతాలకు పటిష్టమైన, పొడవైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. 2FA కోసం SMSకు బదులు ఆధారిత యాప్‌లను (ఉదా: Google Authenticator) ఎంచుకోండి.
సందేహాస్పద కాల్ వస్తే జాగ్రత్త వహించండి:
ఎవరైనా మీ SIM లేదా ఖాతా వివరాలను అడిగినట్లయితే వెంటనే వివరాలు చెప్పకుండా, ఆపరేటర్‌తో నేరుగా సంప్రదించండి.
నిరంతర పర్యవేక్షణ:
మీ బ్యాంక్ ఖాతా , మొబైల్ బిల్లింగ్‌లో లావాదేవీలను నిరంతరం పరిశీలించండి.
SIM స్వాప్ మోసాలు ఈ డిజిటల్ యుగంలో ఒక పెద్ద సవాలుగా మారాయి. ఈ మోసం నుండి రక్షణ కోసం వినియోగదారులు, ఆపరేటర్లు కలిసి పనిచేయాలి. జాగ్రత్తగా ఉండడం, ఆధునిక రక్షణ పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
Read Latest Telangana News and National News